ETV Bharat / crime

H-1B Visa Scam: హైదరాబాద్‌ నుంచి స్కెచ్.. వెలుగులోకి హెచ్-1 బీ స్కామ్ - H-1B Visa Scam at Hyderabad

అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మెసానికి పాల్పడిన క్లౌడ్ జెన్ కంపెనీకి అక్కడి హ్యూస్టన్ కోర్టు ఐదేళ్లపాటు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని నిషేధం విధించడంతో పాటు.. మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. పోలాండ్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు రికార్డులు పరిశీలించగా ఈ కుంభకోణం ( H-1B Visa Scam)వెలుగుచూసింది. క్లౌడ్ జెన్ సిస్టం సంస్థ ప్రతినిధి జమాన్ చక్కాలకల్ ఈ విషయాన్ని కోర్టులో అంగీకరించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జెన్నీపర్ బీలౌరీ తెలిపారు.

visa fraud
visa fraud
author img

By

Published : Jun 4, 2021, 1:19 PM IST

సాఫ్ట్​వేర్ ఇంజినీర్లుగా అమెరికాకు(America) వెళ్లేందుకు హెచ్-1బీ( H-1B) వీసాలు ఇప్పిస్తామంటూ భారీ అక్రమాలకు పాల్పడిన క్లౌడ్ జెన్ కంపెనీ (Cloud Gen Company) కి పోలాండ్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు రికార్డులు పరిశీలించగా కుంభకోణం వెలుగుచూసింది. సాప్ట్​వేర్ ఇంజినీర్లకు 2013 నుంచి డిసెంబర్ 2020 వరకు అక్రమంగా హెచ్-1బీ వీసాలు ఇప్పించినట్లు నిర్ధరణ కావడంతో టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ కోర్డు ఆరు రోజులక్రితం క్లౌడ్ జెన్ సిస్టం సంస్థకు మిలియన్ డాలర్ల జరిమానా (భారత కరెన్సీలో ఏడు కోట్లు), ఐదేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించకుండా తీర్పు వెలువరించింది. క్లౌడ్ జెన్ సిస్టం ప్రతినిధి జమాన్ చక్కాలకల్ కోర్టులో అంగీకరించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జెన్నీపర్ బీలౌరీ తెలిపారు.

అయితే.. ఈ క్లౌడ్ జెన్ సంస్థపై సైబరాబాద్​లో ఎటువంటి ఫిర్యాదులు రాలేదని సీపీ సజ్జనార్(cp sajjanar) తెలిపారు. క్లౌడ్ జెన్ సంస్థ గచ్చిబౌలీలోని ప్లాంటినం భవనంలో కొన్నేళ్ల క్రితం ప్రవాసాంధ్రులు శశి పల్లెంపాటి, సందీప్​లు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కన్సల్టెన్సీ అమెరికాలోని వర్జీనియా, కెనెడా, రుమేనియాలో కార్యాలయాలు ప్రారంభించి ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేవారికోసం హెచ్-1బీ వీసాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చుకున్నారు. సాప్ట్​వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో వందలాదిమంది వృత్తినిపుణులు ఈ సంస్థను ఆశ్రయించారు. ఏడేళ్లపాటు వృత్తినిపుణులను అమెరికాలోని పలు రాష్ట్రాలకు పంపించారు.

అమెరికాలో అక్రమంగా ప్రవేశించి.. ఉద్యోగాలు పొందేవారిని బెంచ్ అండ్ స్విచ్ కుంభకోణం అంటారు. హెచ్-1బీ వీసాపై వెళ్లాలంటే అమెరికాలో సంస్థ ఉద్యోగం ఇస్తున్నట్లు నియామకపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇది మూడేళ్లపాటు మాత్రమే ఉంటుంది. అమెరికాలో ఉన్నవారే సృష్టించిన కంపెనీ ఇచ్చిన హెచ్-1బీ వీసాను అమెరికా హోమ్​లాండ్ కంపెనీ సెక్యూరిటీ విభాగానికి పంపిస్తారు. కొత్త కంపెనీలో చేరినందుకు తమకు ఆ కంపెనీ తరపున హెచ్-1బీ వీసా ఇప్పించాలని దరఖాస్తు చేసుకుంటారు. అయితే.. ఈ క్లౌడ్ జెన్ కంపెనీ సుమారుగా ఎనిమిదేళ్ల క్రితం వీసాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసినట్లు, భారీగా అక్రమాలకు పాల్పడినట్లు పోలాండ్ సెక్యూరిటీ ఆఫ్ లేబర్ విభాగం అధికారులకు అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చూడండి: Covid : జలమండలిపై రెండో దశ కొవిడ్ పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.