నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాకాసిపేటలోని ముస్లిం గ్రేవ్‌యార్డు సెక్యూరిటీగా పనిచేస్తున్న యూసుఫ్ఖాన్ను దుండగులు హతమార్చారు. సమాచారమందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకున్నారు.
యూసుఫ్ మెడపై గునపంతో గుచ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. యూసుఫ్ గత నెలరోజులుగా ఇక్కడ సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. హత్యకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
- ఇదీ చూడండి : గల్ఫ్‌కు పంపించలేదనే కోపంతో ఏజెంట్‌పై కత్తితో దాడి