Graduate Record Examination Mas Coping: గ్రాడ్యుయేట్ రికార్డు పరీక్ష (Graduate Record Examination)లో మాస్ కాపీయింగ్‌పై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా-ఈటీఎస్ ప్రతినిధులు ఆధారాలతో వెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి జీఆర్ఈ టాప్ స్కోర్ కోసం రూ.25వేలు లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు రాసే టెస్టులో మాస్ కాపీయింగ్ జరిగిందని వారు తెలిపారు. ఆన్లైన్ పరీక్ష గదిలో పక్కనే కూర్చుని జవాబులను ఈ ముఠా పరీక్ష రాసే వారి అందజేసిందని ఈటీఎస్ ప్రతినిధులు ఆరోపించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: