వేగంగా వచ్చిన ఓ బొలెరో.. బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో ఇది జరిగింది.
కోమటికుంట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తోన్న గోపాల్ (40).. స్కూల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్ల కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపాల్ మృతితో.. తోటి ఉద్యోగస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Murder: గుర్తు తెలియని వ్యక్తుల దాడితో యువకుడి మృతి