కరోనా బారిన పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆనంద్‌కుమార్ హాస్టల్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వృత్తి రీత్యా స్థానిక గిరిజన హాస్టళ్లను పర్యవేక్షిస్తున్న క్రమంలో ఆయన కొవిడ్ బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అంతకుముందే నిమోనియాతో బాధపడుతోన్న ఆనంద్.. కరోనా ధాటికి ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిని, మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: ప్రాణాలు తీస్తున్న మొరం, ఇసుక టిప్పర్లు, లారీలు