నిర్మల్ జిల్లాలో కొంత కాలంగా గుట్కా అక్రమ రవాణా భారీగా సాగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మామడ మండలం కొరిటికల్ ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో... బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80 సంచుల నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి గుట్కా సంచులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన పవన్ అనే వ్యక్తి వీరిని అక్కడికి పంపినట్లు చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.28 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి