ETV Bharat / crime

Furniture Cheating: ఫర్నిచర్​పై 40శాతం తగ్గింపు.. ఆశ పడితే మోసమే.! - golden agency order suppliers cheating

ఏదైనా వస్తువు తగ్గింపు ధరకు(offers) వస్తుందంటే చాలు.. అప్పు చేసైనా కొనాలని(customers attraction) చూస్తాం. మన ఆ ఆలోచనే.. మోసం చేసే వారి పెట్టుబడి అవుతోంది. మోసం చేసే వాళ్లు ఎత్తుకు పైఎత్తు వేసి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నట్లు నిత్యం అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినా ప్రజల ధోరణిలో మార్పు రావటం లేదు. తక్కువ ధరకు ఫర్నిచర్‌(Cheap furniture‌) వస్తుందని ఆశపడి డబ్బులు చెల్లించి చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. కోపోద్రిక్తులైన జనాలు దుకాణంపై ఎగబడి అందిన కాడికి దోచుకెళ్లారు.

golden agency suryapet, Cheating customers with Offers
గోల్డెన్​ ఏజెన్సీ సూర్యాపేట
author img

By

Published : Nov 18, 2021, 2:23 PM IST

ఫర్నిచర్​పై 40శాతం తగ్గింపు.. ఆశ పడితే మోసమే

మోసం చేసేవాళ్లు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆశాపరులను(Cheating customers with Offers) చిత్తు చేస్తున్నారు. వారి జేబులకు కన్నం వేస్తున్నారు. భారీ డిస్కౌంట్(big discount offers) పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి సరి కొత్త మోసానికి పాల్పడి రూ. 75 లక్షల రూపాయలతో ఉడాయించాడు.

దోచేశారు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో 25 రోజుల కిందట ప్రారంభించిన గోల్డెన్ ఏజెన్సీ(golden agency order suppliers) ఆర్డర్ సప్లయర్స్ బోర్డు(Cheating customers with Offers) తిప్పేసింది. తమిళనాడు తంజావూరుకు చెందిన అయ్యప్పన్ అనే వ్యాపారి.. అసలు ధర మీద 40 శాతం తగ్గింపుతో ఇంటి ఫర్నిచర్ ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచాడు. ప్రజల నుంచి భారీగా ఆర్డర్ రూపంలో వసూలు చేసిన సొమ్ముతో అయ్యప్పన్ ఉడాయించాడు.

ఆశపడితే..

కొన్ని పేరున్న కంపెనీల మంచాలు, సోఫాలు, పరుపులు, కుర్చీలు, బల్లాలతో పాటు అనేక రకాల హోం ఫర్నిచర్‌తో భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ఏజెన్సీ సభ్యులు​ ప్రచారం చేశారు. తక్కువ ధరలకు ఇస్తామని నమ్మబలికి , డబ్బులు చెల్లించిన 12 రోజులకు వస్తువులు ఇస్తామని ప్రజలకు చెప్పారు. నిజమేనని నమ్మిన వినియోగదారులు ఒక్కొక్కరు రూ. 20 నుంచి 30 వేల వరకు చెల్లించారు. అయితే మొదట్లో 12 రోజులు పూర్తైన వారికి ఫర్నిచర్(Cheating customers with Offers) అందజేయటంతో తమకూ అలాగే ఇస్తారని ఆశతో చాలా మంది ఈ స్కీంలో చేరారు. ఇలా దాదాపు 250 మంది వరకు డబ్బులు చెల్లించారు.

డబ్బు చెల్లించిన అనంతరం.. రెండు రోజుల నుంచి దుకాణం(Cheating customers with Offers) తీయకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే నిర్వాహకులు డబ్బులతో ఉడాయించినట్లు తేలింది. దీంతో బాధితులు పెద్ద ఎత్తున దుకాణం వద్దకు చేరుకున్నారు. తమకు ఇస్తానన్న వస్తువును పట్టుకుని పోయారు. 250 మంది నుంచి సుమారు రూ. 75 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

తక్కువ ధరకే ఇస్తామంటే రూ. 50 వేల వరకు కట్టి.. మంచాలు, బీరువా బుక్​ చేశాం. 17వ తారీఖు ఇస్తామన్నారు. రెండు రోజుల నుంచి దుకాణానికి తాళం వేసి ఉంది. ఇలా మోసం చేస్తారనుకోలేదు. మాకు వచ్చే ఫర్నిచర్​ అంతా వేరే వాళ్లు తీసుకెళ్లిపోయారు. -లక్ష్మీ, బాధితురాలు

డబ్బులు కట్టిన 12 రోజులకు ఫర్నిచర్​ ఇస్తామన్నారు. రసీదు ప్రకారం 17వ తారీఖు ఇవ్వాలి. దుకాణం మూసివేసి ఉంది. భారీ ఎత్తున మోసం చేశారు. ఏం చేయాలో తోచడం లేదు. పోలీసులు.. నిందితులను పట్టుకుని మా సొమ్ము మాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సోమయ్య, బాధితుడు

ఇవీ చదవండి: Cyber Crime : ఏంటి సైబర్​ మోసాలకు ఇలా చిక్కుకుంటున్నారా?

NIA raids in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా

Cybercriminals: బావ డేటా ఇస్తే.. బామ్మర్ది లూటీ చేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.