Gold seize in shamshabad: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసోం గువహటి నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో అక్రమంగా బంగారం రవాణా అవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించారు.
gold caught in airport: విమానం ఎయిర్‌పోర్టుకు రాగానే సోదా చేయగా గుర్తు తెలియని వ్యక్తి సీటు కింద పాకెట్‌లో పేస్టు రూపంలో దాచిన 472.8 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన పసిడి విలువ విలువ 23 లక్షల 33 వేల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు
ఆగని అక్రమ రవాణా
ప్రతి రోజు విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతున్నా.. అక్రమ రవాణా ఏమాత్రం ఆగడం లేదు. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచే అధిక మొత్తంలో పసిడిని సీజ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: