ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు.. ఓ యువతి ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి, జిల్లా కేంద్రానికి చెందిన బారుపాటి సాయి సూర్యవర్మ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అతడు నిరాకరించాడు.
ఈ విషయమై పంచాయితీ జరిగింది. సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ జరిగినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. విసుగు చెందిన యువతి ప్రజాసంఘాల నేతలతో కలిసి సూర్యా ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ప్రియుడితో పెళ్లి జరిపించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: భార్యను వ్యభిచారం చేయాలని భర్త ఒత్తిడి.. అరెస్ట్ చేసిన పోలీసులు