ETV Bharat / crime

పదేళ్ల ప్రేమ... పెళ్లన్నాక పరార్​... - bhadradri district crime news

ప్రేమించాడు... పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు. ఆపై శరీరకంగా వాంఛ తీర్చుకున్నాడు. పదేళ్లుగా సహజీవనం చేసాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీనితో ఆ ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

పదేళ్ల ప్రేమ... పెళ్లన్నాక పరార్​...
పదేళ్ల ప్రేమ... పెళ్లన్నాక పరార్​...
author img

By

Published : Mar 4, 2021, 7:33 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉట్లపల్లికి చెందిన ఓ యువతి(29), పేరాయిగూడెంకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నిండా హరి పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రియురాలు అతనిని అడిగింది. దీనితో పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు.

మనస్తాపానికి గురైన ఆ యువతి వెంకమ్మ చెరువు కట్టమీద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్నేహితులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలతో బయటపడ్డ ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి.. తనకు న్యాయం జరపాలని ఆందోళనకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.