ఏపీ(Ap news)లో విశాఖలోని ఓ షాపింగ్ మాల్‌లో ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుంది. ఆదివారం సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం.. మద్దిలపాలెంలోని మాల్‌కు వెళ్లింది. పై అంతస్తుకు వెళ్లేందుకు వారు ఎస్కలేటర్ ఎక్కారు. మార్గమధ్యలో చిన్నారి డ్రెస్ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. భయంతో పాప గట్టిగా కేకలువేయడంతో.. మాల్ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్‌ను ఆపివేశారు. సుమారు 2 గంటల పాటు.. షాపింగ్ మాల్ సిబ్బంది శ్రమించి పాపను బయటకు తీశారు.
- ఇదీ చదవండి షహీన్ తుపాను బీభత్సం- మహానగరం అతలాకుతలం!