కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో జరిగింది. గ్రామంలో ఓ యువతిని ధనశేఖర్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ధనశేఖర్‌ను యువతి తండ్రి బాబు దారుణంగా హతమార్చాడు. బాబు పొలంలోనే ధనశేఖర్ మృతదేహం లభించింది.
"ధనశేఖర్ శనివారం రాత్రి నుంచి కన్పించట్లేదని ఫిర్యాదు అందింది. యువతి తండ్రి బాబు హత్యచేశారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా యువతి తండ్రి కాల్‌డేటా పరిశీలించాం. శనివారం రాత్రి 10 గంటలకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు గుర్తించాం. యువతి తండ్రి ఫోన్ నుంచి ధనశేఖర్‌కు కాల్స్ వెళ్లినట్లు గుర్తించాం. యువతి తండ్రి బాబును అరెస్టు చేసి విచారించాం. శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్ ఉండటాన్ని చూశానని చెప్పాడు. ధనశేఖర్‌ను కత్తితో నరికినట్లు యువతి తండ్రి ఒప్పుకున్నాడు. గ్రామ శివారులోని బావిలో కొంత మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. సోమవారం బావిలో మృతదేహం తేలడాన్ని గమనించారు. మిగతా మృతదేహాన్ని ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టాడు. నేరం ఒప్పుకోవడంతో యువతి తండ్రిని అరెస్టు చేశాం".- పలమనేరు డీఎస్పీ
ఇదీ చూడండి: Accident: రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి.. అంతలోనే విషాదం