అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాప నిండు ప్రాణాలు బలితీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని మొరంచపల్లి గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల మిల్కీ అనే పాపను టిప్పర్ లారీ ఢీ కొట్టటంతో.. అక్కడికక్కడే మృతి చెందింది.
ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను చితకబాది.. టైర్లలో గాలి తీసేశారు. పాప బంధువులు, గ్రామస్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేది స్పష్టం చేశారు. జాతీయ రహదారి కావటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగం ఎరవేసి... మహిళను అరబ్షేక్కు అమ్మేశాడు'