ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండా సమీపంలో ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కిషన్ కూతురు(6) రహదారిపై ఆడుకుంటుండగా.. ఇల్లందు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన ఇల్లందు వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బ్లాక్ మార్కెట్కు ఔషధాలు.. ఇద్దరు వైద్యులు సహా ఐదుగురు అరెస్ట్