గంజాయిపట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టేందుకు నయా సవేరా ప్రోగ్రాం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హాట్ స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 160 కేసులు నమోదయ్యాయని... 7 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 66 మంది నిందితులపైన పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్...
గంజాయి తరలిస్తున్న (Ganja Smuggling) ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను హైదరాబాద్లోని ఎల్‌బీనగర్‌లో అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ భగవత్ తెలిపారు. వారి నుంచి 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.18.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. విశాఖ వాసి పెద్దబాలన్న గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిందని తెలిపారు.
అరటి పండ్ల లోడ్‌లో వేసుకుని గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగపుర్‌కు తరలిస్తున్నట్లు (Ganja Smuggling) గుర్తించామని తెలిపారు. ప్రధాన నిందితులైన లుంబరామ్ సోలంకి(24), కృష్ణారామ్(24) అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారయ్యారని పేర్కొన్నారు. వీరి నుంచి ఒక మినీ వ్యాన్, 3 మొబైల్ ఫోన్స్, రూ.1,100 స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను హైదరాబాద్లోని ఎల్‌బీనగర్‌లో అరెస్టు చేశాము. వారి నుంచి 110 కేజీల గంజాయిని, ఒక మినీ వ్యాన్, 3 మొబైల్ ఫోన్స్, రూ. 1100 స్వాధీనం చేసుకున్నాము. గంజాయి సరఫరా చేసే వారికి, వాడే వారికి...అత్యంత బలమైనదని ఎన్‌డీపీఎస్ చట్టం ద్వారా ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. -మహేశ్ భగవత్, రాచకొండ కమిషనర్
ఇదీ చదవండి: వంతెన ఎక్కేటప్పుడు లారీలో నుంచి కారుపై పడిన బండరాయి