ETV Bharat / crime

Ganja seize: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ - హైదరాబాద్ తాజా వార్తలు

Ganja seize: సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా ఉంటూ సులభంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కాడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్. భద్రాచలం కొత్తగూడెం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.

Boda Hathiram
బోడా హథీరామ్
author img

By

Published : Apr 18, 2022, 8:00 PM IST

Ganja seize: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. మీర్​పేట్​ పీఎస్​ పరిధిలో 190 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో మీర్​పేట పోలీసులు జిల్లెల గూడ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించారని డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ తెలిపారు.

అందులో భాగంగా హైదరాబాద్​కు వస్తున్న కారును తనిఖీ చేసిన పోలీసులు.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. పాత నేరస్తుడు నేనావత్ కృష్ణ, సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న బోడా హథీరామ్​లు మరో ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని గంజాయి సరఫరాను చేస్తున్నారని తెలిపారు.

ganja seized police
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

నిందితుల వద్ద నుంచి 190 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్​లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని తెలియచేశారు. మరొకరు పరారీలో ఉన్నారన్నారు. అతన్ని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా పని చేసిన పోలీసులకు డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ రివార్డులను అందజేశారు.

ఇదీ చదవండి: Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'

'అతడ్ని పెళ్లి చేసుకో'.. బలవంతపెట్టిన భర్త.. 15 మందితో కలిసి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.