ETV Bharat / crime

కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం! - యువతిపై సామూహిక అత్యాచారం

ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో దారుణం జరిగింది. పుష్కరఘాట్‌లో నిన్న రాత్రి ప్రేమజంటపై దాడి జరిగింది. యువకుడిని తాళ్లతో కట్టేసిన ఇద్దరు దుండగులు... ఆ తర్వాత యువతిపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. బాధితురాలు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

gang
కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి
author img

By

Published : Jun 20, 2021, 7:08 PM IST

కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి

సరదాగా గడిపేందుకు.. సీతానగరం పుష్కర ఘాట్‌కు వెళ్లిన ప్రేమ జంటపై దాడి జరిగింది. బాధితురాలు నర్సింగ్‌లో శిక్షణ పొందుతుండగా.. ఆమెను పెళ్లి చేసుకోబోయే యువకుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. వీరు నిన్న రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి.. యువతిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి గుంటూరు జీజీహెచ్​లో(GGH) చికిత్స అందిస్తున్నారు.

నిన్న రాత్రి పుష్కరఘాట్‌లో తన కుమార్తెపై.. అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. తన కుమార్తెకు ఇటీవలే పెళ్లి నిశ్చయించామని.. ఇలాంటి సమయంలో ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రేమజంటపై దాడి, యువతిపై అత్యాచార(Rape) ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు బ్లేడ్ బ్యాచ్ యువకులే కారణమని అనుమానించిన పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు 3 ప్రత్యేక బృందాలను నియమించామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు.

ఇదీ చదవండి: Youtube Channels: ఈ ఛానెళ్లు అన్నదాత కోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.