ETV Bharat / crime

Thefts in gadwal : గద్వాలను గజగజలాడిస్తున్న గజదొంగలు.. పోలీసుల వైఫల్యమేనంటున్న ప్రజలు

Thefts in gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో వరస దొంగతనాలు ప్రజల్ని ఆందోళనగు గురిచేస్తున్నాయి. గురువారం సాయంత్రం నడకకు వెళ్లిన ఓ మహిళ కంట్లో కారం కొట్టి మెడలోని చైన్‌ లాక్కెళ్లాడు ఓ దుండగుడు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం రోజున రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి.

chory in gadwal
chory in gadwal
author img

By

Published : Jan 9, 2022, 1:30 PM IST

గద్వాలను గజగజలాడిస్తున్న గజదొంగలు.. పోలీసుల వైఫల్యమేనంటున్న ప్రజలు

Thefts in gadwal : గద్వాలను గజదొంగలు గజగజలాడిస్తున్నారు. జిల్లాలో దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. పలు చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలల్లో ఇళ్లు, కార్యాలయాలు, గుళ్లలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలకు పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది గస్తీ కాస్తున్నారని చెబుతున్నారు.

Robbery in Gadwal : ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గద్వాల పట్టణంలో 8 బృందాలు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం 2 బృందాలు మాత్రమే గస్తీ తిరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో సొత్తు రికవరీ చేయడంలోనూ పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రతి గల్లీలో యువకులను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించేవారు. కానీ జిల్లా ఏర్పాటు తర్వాత దీన్ని పట్టించుకోవడం లేదు. అయితే దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో తమవంతు కృషి చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

గతేడాది ఇలా..

Chain Snatching in Gadwal : 2021లో జిల్లావ్యాప్తంగా ప్రాపర్టీ సంబంధిత కేసులు 136 కాగా ప్రాపర్టీ నష్టం రూ.1,58,89,060 జరిగిందని, అందులో రూ.95,12,200 రికవరీ చేసినట్లు ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ తెలిపారు. ఇందులో 60 శాతం మాత్రమే రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. నెలలో రెండు, మూడు దొంగతనాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

.

జరిగిన దొంగతనాలు

గురువారం సాయంత్రం కొత్త హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు సాయంత్రం నడకకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె కంట్లో కారం కొట్టి మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ ఎత్తుకెళ్లాడు. ఆ సంఘటన మరువక ముందే శుక్రవారం మూడు ఇళ్లల్లో చోట్ల దొంగతనాలు చేశారు.

శుక్రవారం అయిజ మండల కేంద్రంలోని అంబాభవాని దేవాలయంలో దుండగులు హుండీ పగులకొట్టి నగదు దోచుకెళ్లారు.

2021 డిసెంబరు 30న పట్టణంలోని లింగంబాగ్‌ కాలనీలో ఓ ఇంటి తాళం పగులగొట్టి రూ.1.70 లక్షల నగదు, 19.8 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే రోజు నల్లకుంట కాలనీలో మరో ఇంటి తాళం పగులగొట్టి రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. మరో ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

2021 అక్టోబరు 10న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్‌లోని నడిరోడ్డుపై ఓ కాంప్లెక్స్‌లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆరు దుకాణాల షట్టర్లు పగులగొట్టడమేకాకుండా ఓ ఫైనాన్స్‌ నిర్వహించే దుకాణంలో నగదు ఎత్తుకెళ్లారు.

2021 జులై 17న పట్టణంలోని రామ్‌నగర్‌, తెలుగుపేట కాలనీల్లోని ఆలయాల్లో దుండగులు చొరబడి రూ.లక్ష నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఇదీ చూడండి: LB Nagar Car Accident : కారు బీభత్సం.. రూ.13,350 పెండింగ్ చలాన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.