ETV Bharat / crime

Singareni: బొగ్గు గని పైకప్పు కూలి.. నలుగురు కార్మికులు దుర్మరణం

author img

By

Published : Nov 11, 2021, 5:42 AM IST

సింగరేణి బొగ్గుగనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు (four coal miners die ). మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది (Srirampur roof collapse ).

singaareni
singaareni

మంచిర్యాల జిల్లా (manchirial district) శ్రీరాంపూర్‌ సింగరేణి ఎస్‌ఆర్పీ-3 బొగ్గు గనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో (Srirampur roof collapse ) నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు (four coal miners die ). విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా బొగ్గు గని పైకప్పు కూలింది. అధికారులు, తోటి కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం విధులకు హాజరైన ఇద్దరు సపోర్ట్‌మన్‌ కార్మికులు, మరో ఇద్దరు బదిలీ ఫిల్లర్లు శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడ్డారు. గని పైకప్పు కూలకుండా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మూడు మీటర్ల మందం, పది మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు మేర కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. టింబర్‌మన్‌ కార్మికుడు బేర లక్ష్మయ్య (60), సపోర్ట్‌మన్‌ వి.కృష్ణారెడ్డి (59), గడ్డం సత్యనరసింహరాజు (31), రెంక చంద్రశేఖర్‌ (32) అక్కడికక్కడే మరణించారని సింగరేణి సంస్థ ప్రకటించింది. ‘కోల్‌ కట్టర్‌ కార్మికులు బొగ్గును డిటోనేటర్లతో పేల్చిన తర్వాత బయటకు వెళ్లారు. తర్వాత పది నిమిషాలకు గని పైకప్పు కూలకుండా చేయడానికి నలుగురు కార్మికులు అక్కడకు వెళ్లిన క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడకు సమీపంలోనే పనిచేస్తున్న కొందరు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు
ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం అయిదు గంటలకు రెంక చంద్రశేఖర్‌ మృతదేహాన్ని ఉపరితలానికి చేర్చారు. రాత్రి 9.30 గంటలకు మిగతావారి మృతదేహాలను వెలికితీశారు’ అని వెల్లడించింది. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం కార్పొరేట్‌ జీఎం సుభాని, ఏరియా జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌, ఎస్‌ ఓ టూ జీఎం గుప్తా, ఏరియా రక్షణాధికారి మల్లేశ్‌, గని మేనేజర్‌ రవికుమార్‌, రక్షణాధికారి కె.వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తెబొగకాసం ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

రోదిస్తున్న చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు

విచారణకు ఆదేశం: సీఎండీ శ్రీధర్‌

శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ-3, 3ఎ ఇంక్లైన్‌ గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. ప్రమాదం అత్యంత దురదృష్టకరమని తెలిపింది. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి తనకు నివేదించాలని సంబంధిత అధికారులను సీఎండీ శ్రీధర్‌ (singaareni cmd Sridhar ) ఆదేశించారు. మృతి చెందిన కార్మికులకు సంస్థ తరఫున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరఫున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యుటీ తదితరాలు కలిపి సుమారు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేస్తామని వెల్లడించారు.

పలువురు నేతల దిగ్భ్రాంతి

సింగరేణిలో నలుగురు కార్మికుల మృతిపట్ల మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనిభాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కార్మికుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి: Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.