Bike thieves arrested in hyderabad: ఈ యువ దొంగల టార్గెట్‌నే ఎక్కువ ఖరీదు చేసే స్పోర్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు మాత్రమే.. వీళ్లని యువ దొంగలు ఎందుకు అన్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీరి ఒక్కొక్కరి వయస్సు 23 సంవత్సరాలు లోపే.. వీరు స్పాట్ పెడితే కచ్చితంగా బైక్ మాయం కావాల్సిందే.. ఎలా అంటారా.. ఒకడు కీ లేకుండా కేవలం కాలితోనే బైక్ తాళం తీస్తాడు..
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన శ్రీకాంత్, రఘులు.. ముజాహిద్పూర్కు చెందిన రమేశ్.. సుల్తాన్పూర్ చెందిన లక్కీ అనే ఈ నలుగురు యువకులు బైక్ దొంగతనాలకు పాల్పడుతుంటారు. అనేక బైకులను దొంగలించారు కానీ ఎక్కడా దొరకలేదు.. దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే కదా! అలాగే దొరికిపోయాడు ఈ యువకులలో ఒక యువకుడు. కుల్కచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి తన బుల్లెట్ బండిని దొంగలించి పారిపోతూ ఉండగా.. పరిగి పట్టణంలో ప్రమాదానికి గురై తీవ్రగాయాలు కావడంతో పరిగి పోలీసులు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.
ఆ దొంగ తెచ్చిన బైక్ యజమానికి ఫోన్ చేసి తమ వాహనం తీసుకొని వెళ్లాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడే అసలు విషయం బయటపడింది. తన బుల్లెట్ వాహనాన్ని నిన్న ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఆ యజమాని చెప్పాడు. ఈ విషయంపై కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పోలీసులకు మొత్తం వివరాలు తెలిపాడు. దీంతో యువకునిపై అనుమానం వచ్చి ఈ విషయంపై ఆరా తీశారు. ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో బుల్లెట్ దొంగను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
ఈ యువకునితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని తేలింది. ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా 14 బైక్‌లను దొంగలించామని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.20లక్షలుగా ఉంటుంది. ఈ మొత్తం బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు నలుగురు తమ అదుపులో ఉన్నారని, వీరి ఒక్కొక్కరి వయసు 23 సంవత్సరాలు లోపే ఉంటుందని డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ నలుగురు దొంగలలో ఒక యువకుడు బైక్ తాళాలు ఏవిధంగా తీస్తారో వివరించాడు. ఈ యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కి తరలించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకొని బైక్‌లను స్వాధీనం చేసుకొన్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: