ETV Bharat / crime

తెల్లారిన కూలీ బతుకులు.. అతి వేగానికి నలుగురు బలి..

రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలు వారివి. మిర్చి కోతలకు వెళ్తేనే పూట గడిచేది. రోజూలాగే పనులకు వెళ్లిన ఆ వ్యవసాయ కూలీల జీవితాలు రోడ్డుప్రమాదంలో తెల్లారిపోయాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది.

four-died-when-toofan-vehicle-hits-auto-in-warangal-rural-district
తెల్లారిన కూలీ బతుకులు
author img

By

Published : Mar 19, 2021, 7:45 PM IST

Updated : Mar 19, 2021, 7:56 PM IST

మితిమీరిన వేగం.. సామర్ధ్యానికి మించి ఆటోలో ప్రయాణం.. వెరసి నలుగురి ప్రాణాలను గాల్లో కలిపేసింది. వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. నీరుకుళ్ల కటాక్షాపూర్ మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న తూఫాన్ వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఆటో నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న కూలీలు ఒ‍క్కసారిగా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఏం జరిగిందో తెలిసేలోగా అంతా స్పృహ కోల్పోయారు.

నీరుకుళ్లలో చిదిమేసిన తూపాన్

ఆత్మకూరుకు చెందిన వీరంతా.. పరిసర ప్రాంతాల్లో మిరపతోటలో పని చేసే వ్యవసాయ కూలీలు. మొత్తం 16 మంది ఆటోలో నల్లబెల్లి మండలం రంగాపురం వద్దకు వెళుతున్నారు. వరంగల్ వైపు వెళుతున్న తుఫాన్ వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తలపగిలి కొందరు.. కాళ్లూ చేతులు విరిగి కొందరు ఎంజీఎంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి పరిసరాల్లో మిన్నంటాయి.

ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. ఎంజీఎం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పరకాల పోలీసులు.. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Last Updated : Mar 19, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.