ETV Bharat / crime

రెమిడెసివిర్ అక్రమ విక్రయం కేసులో నలుగురు అరెస్ట్ - ఏపీ వార్తలు

రెమిడెసివిర్ ఇంజిక్షన్ల అక్రమ విక్రయం కేసులో ఏపీలోని విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కొవిడ్​ సోకిన సమయంలో కొనుగోలు చేసిన వాటిని బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తుండగా విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు.

remedicivir smuggling case
రెమిడెసివిర్
author img

By

Published : Apr 21, 2021, 8:17 PM IST

రెమిడెసివిర్ ఇంజిక్షన్ల అక్రమ విక్రయం కేసులో విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కొవిడ్​ సోకినప్పుడు కొనుగోలు చేసిన ఇంజిక్షన్లను... ప్రస్తుతం బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్నారని ఏసీపీ హర్షిత తెలిపారు. గత నెలలో ఆస్పత్రి హౌస్ కీపింగ్ మేనేజర్​కు కొవిడ్ సోకిందని.. ఆ సమయంలో ఇంజెక్షన్లు కొన్నారని ఏసీపీ హర్షిత తెలిపారు.

వాటిని నల్ల బజారులో విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఇద్దరు నర్సులు సహా నలుగురు ఓమ్ని ఆర్కే ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.