ETV Bharat / crime

Khammam Bike Lift Case Mystery update: ఇది.. భార్య రాసిన మరణశాసనం - Khammam Bike Lift Case Mystery

Khammam Bike Lift Case Mystery update
బైక్ లిఫ్ట్ మిస్టరీ.. పోలీసుల అదుపులో మృతుడి భార్య సహా నలుగురు నిందితులు
author img

By

Published : Sep 21, 2022, 10:33 AM IST

Updated : Sep 21, 2022, 1:01 PM IST

10:27 September 21

బైక్ లిఫ్ట్ మిస్టరీ.. పోలీసుల అదుపులో మృతుడి భార్య సహా నలుగురు నిందితులు

Khammam Bike Lift Case Mystery: వివాహేతర బంధం.. పచ్చని కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో.. మనుషుల ఆలోచనలపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి అద్దం పడుతోంది ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగుచూసిన హత్య ఘటన. తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ మహిళ ఏకంగా విష ప్రయోగం చేసి, హత్య చేయించిన ఘటన విస్మయం కలిగిస్తోంది.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్.. తన కుమార్తె ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ముదిగొండ మండలం వల్లభి కాటమయ్య దేవస్థానం సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. సాటిమనిషికి సాయం చేద్దామన్న సదుద్దేశంతో.. జమాల్ సాహెబ్ గుర్తు తెలియని వ్యక్తిని బైక్​పై ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే వెనక కూర్చున్న వ్యక్తి.. మోటార్​ సైకిల్​ దిగిపోయాడు. అనంతరం జమాల్​సాహెబ్​ అలా కొద్దిదూరం వెళ్లాడో.. లేదో.. బైక్​ పైనుంచి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తనకు ఇంజక్షన్ చేశాడని స్థానికులకు చెప్పిన జమాల్​ సాహెబ్​.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

పట్టించిన ఫోన్​కాల్​..: చనిపోతూ సాహెబ్​ చెప్పిన మాటలు.. ఇంజక్షన్​తో హత్య చేయటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్.. కేసును ఛేదించేందుకు 4 ప్రత్యేక బృందాలను నియమించారు. ఘటన జరిగిన తీరు, నిందితుల ఆచూకీ కోసం ముమ్మర విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ముందు నుంచి జమాల్ సాహెబ్ కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఫోన్ కాల్ డేటా సేకరించడం, ఆ కాల్ డేటాలో ఉన్న వివరాల ఆధారంగా ఎక్కువ సార్లు ఫోన్​లో మాట్లాడిన వ్యక్తులను గుర్తించారు. జమాల్ భార్య ఫోన్​కాల్​ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నెంబర్లు ఉండటం, వారితోనే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఆధారాలు లభించటంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. జమాల్​ సాహెబ్​ భార్య ఇమామ్​బీని విచారించిన పోలీసులు.. చింతకాని మండలం నామవారానికి చెందిన మోహన్​రావు, ట్రాక్టర్​ డ్రైవర్​ వెంకటేశ్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్​ను అదుపులోకి తీసుకున్నారు.

రెండు నెలల క్రితమే ప్లాన్​..: ఇమామ్​బీ తన ప్రియుడితో కలిసి జమాల్​ హత్యకు రెండు నెలల క్రితమే పథకం రచించింది. ఇందులో భాగంగా ఆర్​ఎంపీ వెంకట్​ సహకారంతో విష ప్రయోగం చేసేందుకు ఇంజక్షన్​ సైతం ఇంట్లోనే దాచిపెట్టింది. కాగా.. ఇంట్లో విష ప్రయోగానికి ధైర్యం చాలకపోవటంతో.. ఆ పనిని తన ప్రియుడికే అప్పజెప్పింది. ఇందులో భాగంగానే.. మోహన్​రావు, వెంకటేశ్, వెంకట్​లు జమాల్​ హత్యకు ప్రణాళిక రూపొందించారు. బిడ్డ ఇంటికి వెళ్లి వస్తున్న జమాల్​ను వీరందరూ దారికాచారు. ఈ క్రమంలోనే ఆర్​ఎంపీ వెంకట్ జమాల్​ బైక్​ ఎక్కి.. ఇంజక్షన్ ఇచ్చి, వెళ్లిపోయాడు.

ఇదీ జరిగింది.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ముదిగొండ మండలం వల్లభి సమీపంలో సోమవారం ఇంజక్షన్ దాడిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. వల్లభిలోని ఘటనా ప్రాంతాన్ని ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. జమాల్ సాహెబ్‌కు మంచినీళ్లు ఇవ్వడంతో పాటు వల్లభి ఆస్పత్రికి తరలించిన ఇద్దరు యువకులను ప్రశ్నించారు.

జమాల్ సాహెబ్‌తో ఆ ఇద్దరికీ గతంలో పరిచయం ఉందా..? జమాల్ సాహెబ్ వారితో ఏం మాట్లాడారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు యువకులు సమాధానమిచ్చారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. ఇదే ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వివరాలూ నమోదు చేసుకున్నారు. అయిప్పటికీ కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసుల దృష్టి జమాల్ సాహెబ్ కుటుంబీకుల వైపు మళ్లింది.

జమాల్ సాహెబ్ కుటుంబసభ్యుల కాల్ డేటాను సైతం పోలీసులు సేకరించారు. ఇక్కడే పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పోలీసులకు లభించిన ఆధారాలతో మున్నేరు ఒడ్డున ఉన్న గ్రామానికి చేరుకుని ఓ వ్యక్తిని విచారించేందుకు వెళ్లగా.. అతడు పోలీసులను ఏమార్చి పరారయ్యాడు. హత్య కేసులో సూత్రధారులుగా ఉన్న మరో ఇద్దరికీ ఈ సమాచారం పొక్కడంతో వారూ పారిపోయారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పూర్తి ఆధారాలు లభించినందున పోలీసులు ఇవాళ మృతుడి భార్య సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి..:

భార్యపై కోపంతో పిల్లలను కాలువలో పడేసిన తండ్రి

52ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు.. రూ.3.5కోట్లు ఖర్చు.. తీరా గెలిచింది ఎంతంటే..

Last Updated : Sep 21, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.