హైదరాబాద్ అంబర్‌పేట సమీపంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బొగ్గు డిపోను అటవీ శాఖ సీజ్ చేసింది. స్థానికంగా నిత్యం బొగ్గు వ్యాపారం జరుగుతోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు వెళ్లి తనిఖీ చేశారు. అబ్దుల్ అలీమ్ అనే వ్యక్తి సాగర్ చార్ కోల్ డిపో పేరుతో అనుమతి లేని బొగ్గు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మహారాష్ట్ర నుంచి..
నిత్యం మహారాష్ట్ర నుంచి లారీల్లో బొగ్గు ఇక్కడికి తరలిస్తున్నట్లు అటవీ శాఖ పరిశీలనలో వెల్లడైంది. బొగ్గు లోడ్‌తో అక్కడే ఆగి ఉన్న మహారాష్ట్రకు చెందిన లారీని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. సామిల్ (కట్టెకోత మిషన్) పేరుతో అనుమతి తీసుకుని నిర్వాహకులు బొగ్గు డిపోను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత వ్యక్తులపై అటవీ శాఖ కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ డీఎఫ్‌వో జోజి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీసుల ఔదార్యం.. వాగులో కొట్టుకుపోతున్న గేదె, దూడ క్షేమం