తమ పిల్లలకు భారం కాకూడదనుకున్నారో ఏమో... కొవిడ్ సోకిన వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(71), సావిత్రి(64)కు ఈనెల 12న కొవిడ్ సోకింది. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వారిద్దరి కుమారుల్లో ఒకరు రాజమహేంద్రవరంలో, మరొకరు ఒడిశాలోని జైపూర్‌లో ఉంటున్నారు. ఉదయం ఇంట్లో దంపతుల అలికిడి లేకపోవడాన్ని గుర్తించిన సమీప బంధువులు రాజమహేంద్రవరంలోని కుమారుడికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న కుమారుడు పరిసర ప్రాంతాల్లో గాలించారు. సాయంత్రం వేళ వారిద్దరి మృతదేహాలను స్థానిక మండపేట కాలువలో గుర్తించారు.
ఇదీ చదవండి: సైదాబాద్ మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు