ETV Bharat / crime

మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి - తెలంగాణ వార్తలు

మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్​డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు ఐదుగురు యువకులు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి నది పోలీస్ చెక్​పోస్ట్ వద్ద చోటు చేసుకుంది.

పోలీసులపై యువకుల దాడి, గోదావరిఖని, గోదావరి నది చెక్​పోస్ట్
attack on police, godavari checkpost, godavarikhani
author img

By

Published : May 17, 2021, 7:06 AM IST

లాక్​డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం, గంజాయి మత్తులో యువకులు దాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది పోలీస్ చెక్​పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్​డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.

రామగుండం సింగరేణి ఓసీపీ-3 ప్రాజెక్టు, సుచి ఇన్ ఫ్రాలో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు యువకులు మంచిర్యాల జిల్లా నుంచి గోదావరిఖనికి వస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారయ్యారు. వారిపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో ఆవు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.