ETV Bharat / crime

డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు సభ్యుల అరెస్ట్ - telangana crime news

నగరంలో గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువ చేసే డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు సభ్యుల అరెస్ట్

author img

By

Published : Jul 12, 2022, 1:03 PM IST

హైదరాబాద్​ ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్ పరిధిలోని మధురానగర్​లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నార్కోటిక్స్ పోలీసులు. ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల విలువ చేసే 36 గ్రాముల మెథంఫెటమైన్ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను ఎస్సార్​నగర్​ పోలీసులకు అప్పగించారు.

ముఠాలోని ప్రధాన నిందితులైన చెన్నైకి చెందిన విష్ణు, ఏపీలోని కడపకు చెందిన బాలాజీ పరారైనట్లు పోలీసులు తెలిపారు. షేక్​పేట వాసి పట్టా జోసెఫ్(22), గచ్చిబౌలి వాసి బాల మణికంఠ(30), కొండాపూర్​కు చెందిన సమంతరావు(24), మధురానగర్ వాసులు చింతల సాయిరాం(24), అఖిల్ కుమార్(26)లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల కొనుగోలుకు వచ్చిన 16 మంది వినియోగదారులూ పరారైనట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి..

రెచ్చిపోయిన బైక్​ రైడర్స్​.. ఆర్టీసీ డ్రైవర్​పై దాడి

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతిపై బ్లేడుతో దాడి.. ముఖానికి 31కుట్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.