Unknown Person Shot At The TDP Leader: ఆంధ్రప్రదేశ్‌లోని రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై దుండగులు.. కాల్పులకు తెగబడ్డారు. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్నా బాలకోటిరెడ్డి పని చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా బాలకోటిరెడ్డిపైనా ప్రత్యర్థులు దాడి చేశారు. ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో కత్తులతో దాడికి పాల్పడ్డారు. తాజాగా మరోసారి పక్కా ప్లాన్‌తో దాడికి చేశారు. తుపాకితో కాల్చడంతో..2తూటాలు పొత్తి కడపులోకి దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను.. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న నుదురుపాడుకు చెందిన వెంకటేశ్వర్లుని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలకోటిరెడ్డిని పరామర్శించిన టిడీపీ నేత అరవిందబాబు: నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేత అరవిందబాబు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలకోటిరెడ్డిపై గతంలోనూ హత్యాయత్నం జరిగిందని అరవిందబాబు ఆరోపించారు. దీంతో ప్రాణహాని ఉందని ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేశాము.. కానీ బాలకోటిరెడ్డికి రక్షణ కల్పించటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
ఇవీ చదవండి: