వరంగల్ అర్బన్ జిల్లాకేంద్రంలోని సిద్దయ్య హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్వల్పంగా ఆస్తినష్టం జరిగింది. హోటల్లో భోజనం తయారు చేస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్లు యజమాని తెలిపారు.
వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. వేసవికాలంలో వాణిజ్య సముదాయాలతో పాటు పరిశ్రమల వారికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అదుపుచేసే యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని వివరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.