షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుందిగల్ ప్రాంతంలోని గండిమైసమ్మ చౌరస్తా పరిధిలో జరిగింది.
ఈ రోజు మధ్యాహ్నం వరకు దుకాణాన్ని తెరిచి ఉంచిన యజమాని లాక్డౌన్ కారణంగా ఒంటిగంట సమయంలో షాప్ మూసేని ఇంటికెళ్లాడు. తాళం వేసి ఉన్న దుకాణంలో నుంచి స్వల్పంగా పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. సుమారు రూ.20 లక్షల విలువైన ప్లాస్టిక్ సామగ్రి మంటల్లో కాలిపోయిందని షాప్ యజమాని వాపోయాడు.
ఇదీ చదవండి: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ