ETV Bharat / crime

Fire Accident: చెత్త అంటుకుని చెలరేగిన మంటలు.. భారీగా కేబుల్స్​ దగ్ధం - చెత్త అంటుకుని చెలరేగిన మంటలు

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఐడీఎస్​ చెరువు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రూ.9 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆ సంస్థ ఉద్యోగులు తెలిపారు.

fire accident in Kukatpally in hyderabad
చెత్త అంటుకుని చెలరేగిన మంటలు
author img

By

Published : Feb 27, 2022, 8:48 PM IST

హైదరాబాద్​లోని కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. చెత్తకుప్పకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సమీపంలోని కంటైనర్‌, ట్రక్కుకు అంటుకున్నాయి. మంటలు అధికం కావడంతో వాహనాల టైర్లు, ఫైబర్ కేబుల్స్​ దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో విజయ్ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్​కు చెందిన కేబుల్స్​ పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. దాదాపు రూ.9 లక్షల ఆస్తి నష్టం జరిగిందని సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.