Fire accident in train: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. దీనిపై రైల్వే అధికారి అభయ్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిందన్నారు. బీబీ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే చివరి భోగిలో మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించామన్నారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే పగిడిపల్లి రైల్వే స్టేషనలో ట్రైన్‌ని నిలిపి.. 4 ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. రెండు పార్సిల్ బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు. రైలు చివరి బోగీలో దగ్ధమైన ప్యాకింగ్ చేసిన సరుకులు ఎక్కువగా అమెజాన్ ఆన్లైన్ షాపింగ్, గృహ వినియోగానికి చెందినవిగా వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి విచారణలో తెలుస్తుందన్నారు.
ఇవీ చదవండి: