హైదరాబాద్ డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారత్ నగర్లో గల ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఇదీ చదవండి: కృష్ణా నదిలో యువకుడి గల్లంతు