వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం శ్రీకొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గుట్ట వెనుకభాగంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. ఓ వైపు స్వామివారి కల్యాణం జరుగుతుండగా... మరోవైపు గుట్టపై మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
పోలీసులు, జాతరకు వచ్చిన యువకులు మంటలను ఆర్పేప్రయత్నం చేసినప్పటికీ... అదుపులోకి రాలేదు. దీంతో అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ పర్యవేక్షణ అధికారి