Fire Accident in Palnadu: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. ముందుగా ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న సుమారు 10 షాపులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని దగ్ధమైన దుకాణాల్ని పరిశీలించారు. కలెక్టర్, అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనావేసి... బాధితులకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: