హైదరాబాద్లోని నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. యూసుఫ్ బాబా దర్గా వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా.. ప్లాస్టిక్ సామాన్లు, కిరాణా దుకాణాలు మంటల్లో కాలిపోయాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హబీబ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సహాయపడ్డారు.