సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో.. పెరుమాళ్ల రత్తయ్య అనే రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించాడు. ఈదురుగాలులు రావడం వల్ల మంటలు పక్కనే ఉన్న మరో రైతు పొలానికి వ్యాపించాయి. అక్కడే ఉన్న గడ్డివాములకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి.
వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి.. పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా మంటలు ఆర్పారు. సుమారు రూ.30 వేలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. వేసవిలో.. వరికొయ్యలు తగులబెట్టేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ సూచించారు.
- ఇదీ చదవండి : టాయిలెట్ గుంతలో గేదె.. బయటపడింది ఇలా!