రంగారెడ్డి జిల్లా కొత్తపేట పరిధిలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఎదుట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా ప్లాస్టిక్ స్క్రాప్ ఉండడం వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మంటలను అర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి