పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని మున్నా ఆటో కన్సల్టెన్సీ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆఫీసులో ఉన్న ఫర్నీచర్, వాహనాలకు సంబంధించిన పత్రాలు, టైర్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమారు లక్ష యాభై వేల రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు మున్నా తెలిపారు.
ఇదీ చదవండి: మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటీ..?