రహదారి నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని కుమురం భీం జిల్లా సిర్పూర్ ఎస్సై రవి కుమార్ అన్నారు. మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా.. అధిక లోడ్‌తో వెళుతోన్న 10 లారీలకు రూ. 1000 చొప్పున జరిమానా విధించారు.
సరుకు రవాణా చేసే వాహనదారులు అధిక లోడ్‌తో వెళ్తూ.. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని రవి కుమార్ వివరించారు. రహదారి నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: KTR RESPOND: ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఆ చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం