ETV Bharat / crime

cash Theft: సిని ఫక్కీలో చోరీ.. నమ్మి కారెక్కితే నగదుతో ఉడాయించాడు..! - కారు డ్రైవర్ పరారీ

cash Theft: పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మాడు. అతనితో కలిసి కారులో బయలుదేరాడు. అందులోనూ.. అతనితో పాటు రూ.15 లక్షల నగదు ఉంది.. కట్​ చేస్తే.. అతని కళ్లముందే నగదుతో సహా పరారయ్యాడు ఆ కారు డ్రైవర్. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. చివరికేమైందంటే..!

fifteen lakh rupees theft
నగదుతో ఉడాయించిన కారు డ్రైవర్
author img

By

Published : Apr 7, 2022, 10:57 PM IST

cash Theft: కారులో ఉన్న రూ.15 లక్షలతో రూపాయల నగదుతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్​ దేవ్​పల్లి పరిధిలో జరిగింది. అయితే పోలీసులు కేవలం ఆరుగంటల్లోనే ఈ కేసును చేధించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

fifteen lakh rupees theft
నగదు తీసుకెళ్లిన కారు

మహబూబ్​నగర్ బూర్గులలోని జ్యోతి స్పిన్నింగ్ మిల్​లో మేనేజర్​గా పనిచేసే జగదీశ్వర్ జీడిమెట్లలో నివాసముంటున్నాడు. కాగా.. కంపెనీకి చెందిన 15 లక్షల రూపాయల నగదుతో గతంలో పరిచయమైన రాజుతో కలిసి క్యాబ్​ జీడిమెట్ల నుంచి మహబూబ్​నగర్​కు బయల్దేరాడు. ఈ క్రమంలోనే మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగళూర్ జాతీయ రహదారి బుద్వేల్ వద్దకు రాగానే మూత్రవిసర్జనకు వెళ్లేందుకు జగదీశ్వర్ కారు ఆపాడు.

అదే అదునుగా భావించిన కారు డ్రైవర్ రాజు.. నగదు ఉన్న బ్యాగ్​తో సహా ఉడాయించాడు. బాధితుడు జగదీశ్వర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కాల్ డేటా, సీసీ ఫుటేజి ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నగదును రికవరీ చేశారు. అద్దె కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపవద్దని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సూచించారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డులను అందజేసి అభినందించారు.

ఇదీ చూడండి: Suicide: ఏపీలో వైకాపా నేత పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.