ETV Bharat / crime

తహసీల్దార్‌పై డీజిల్ పోసిన అన్నదాత.. రైతు మృతదేహంతో ధర్నా

మెదక్ జిల్లా శివ్వంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పోందలేకపోతున్నామని రైతు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పాసుపుస్తకాలు రాలేదన్న ఆగ్రహంతో తొలుత తమపై డీజిల్ పోసుకున్న అన్నదాతలు అనంతరం తహసీల్దార్‌పై పోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

tahsildar diesel pouring incident, farmers
తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు, రైతుల ధర్నా
author img

By

Published : Jun 30, 2021, 7:50 AM IST

Updated : Jun 30, 2021, 9:22 AM IST

తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు,

భూమిపై హక్కులు దక్కనందుకు అన్నదాతలు కన్నెర్ర జేశారు. తమపై డీజిల్‌ పోసుకోవడంతో పాటు తహసీల్దార్‌ తలపై కుమ్మరించారు. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో మంగళవారం ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన బాలు తన పొలంలో విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందారు. ఆయనకు పది ఎకరాల భూమి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టా పాసుపుస్తకం రాలేదని రైతులు తెలిపారు. ఆయన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి హక్కులు రికార్డుల్లో నమోదు కాలేదని పేర్కొన్నారు. పాసుపుస్తకాలు ఇవ్వాలని గతంలో అనేక పర్యాయాలు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పాసుపుస్తకాలు ఉంటే రైతుబంధు సాయం, రైతు బీమా పరిహారం వచ్చేదని అన్నారు.

మృతదేహంతో ధర్నా

పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లే రైతుబీమా పరిహారం రావడం లేదని బాలు మృతదేహంతో రైతులు శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో ధర్మతండా, తాళ్లపల్లి గడ్డ తండా, పుర్యా తండా, బిక్యా తండా తదితర గ్రామాలకు చెందిన సుమారు వందమంది రైతులు పాల్గొన్నారు. దాదాపు 350 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే మేం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పోందలేకపోతున్నాం. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.'

-మృతుని బంధువు

డీజిల్ బాటిళ్లు తెచ్చుకుని కార్యాలయం ముందు బైఠాయించి కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. వారి గోడు వినేందుకు వచ్చిన తహసీల్దార్‌ భానుప్రకాశ్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఆయన తలపై గుమ్మరించారు. కొంత మంది తమపైనా పోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టడి చేశారు.

'తాళ్లపల్లి తండాలో విద్యుదాఘాతంతో మాలోత్​ బాలు మరణించారు. పరిహారం, రైతు బంధు, రైతు బీమా విషయంలో మృతదేహాన్ని తమ కార్యాలయానికి తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు. చనిపోయిన రైతుకు విద్యుత్ శాఖ నుంచి పరిహారం అందించి న్యాయం చేస్తామని చెప్పాం. త్వరలో భూ సమస్యలు పరిష్కరించి పట్టా పాసుపుస్తకాలు ఇస్తామని హమీ ఇచ్చాం. తనపై డీజిల్‌ పోసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దాదాపు 10 మంది రైతులు వారి ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆందోళనకు దిగడంతో పాటు నాపై పోసి చంపేందుకు యత్నించారు.'

-భాను ప్రకాశ్, శివ్వంపేట తహసీల్దార్

సమాచారం అందుకున్న పోలీసులు, ప్రజా ప్రతినిధులు వెంటనే అప్రమత్తమై కార్యాలయం చేరుకుని విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

శివ్వంపేట పరిధిలోని 315, 316సర్వే నంబర్లలో అటవీ భూమితో పాటు, విస్తీర్ణానికి మించి రికార్డుల్లో నమోదు కావడం వల్ల సకాలంలో పాసుపుస్తకాలు జారీ కాలేదని తహసీల్దార్ భానుప్రకాశ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ భూముల సర్వే పూర్తైందని.. త్వరలో అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆయనను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు హత్యాయత్నం చేశారని తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో 14మందిపై కేసు నమోదు చేశాం. తహసీల్దార్‌తో పాటు రైతులకు తృటిలో ప్రమాదం తప్పింది.

-స్వామిగౌడ్, సీఐ

ఇదీ చదవండి: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

Last Updated : Jun 30, 2021, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.