Farmer suicide attempt: కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగా తన భూమి పోతుందన్న భయంతో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామేశ్వర్పల్లికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ అనే రైతు ఇవాళ పురుగుల మందు తాగగా.. కుటుంబీకులు వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో రైతు బాలకృష్ణకు ఎకరం భూమి ఉండగా.. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో తన భూమి పోతుందని మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు గ్రామస్థులు, కుటుంబీకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: