ETV Bharat / crime

భూమి కబ్జా చేశారని కలెక్టరేట్​ ఎదుట ఆత్మహత్యాయత్నం - farmer Suicide attempt at the Collectorate in nizamabad district

కొందరు తన భూమిని కబ్జా చేశారంటూ కలెక్టరేట్​ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ వ్యక్తి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయాడు. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.

farmer suicide at collectorate
కలెక్టరేట్​ ముందు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 15, 2021, 3:54 PM IST

కొందరు తన భూమిని కబ్జా చేశారంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​ ముందు జరిగింది. జిల్లాలోని డిచ్​పల్లి మండలం యానాంపల్లికి చెందిన సంతోష్​చారి.. జీననోపాధి కోసం దుబాయ్​ వెళ్లాడు. ఈ క్రమంలో తన పేరిట ఉన్న భూమి, తమ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఎకరన్నర భూమి ఇచ్చిందని.. దుబాయ్​లో ఉండగా గ్రామానికి చెందిన అంకం గిరి, జయ్య రమేష్​లు కబ్జా చేసి అమ్ముకున్నారని సంతోష్​ కుమార్​ పేర్కొన్నాడు.

విషయం తెలుసుకున్న సంతోష్​చారి స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన భూమిని తిరిగి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగానని.. అయినా ఫలితం లేదని వాపోయాడు. దానిపైనే తమ బతుకుదెరువు ఆధారపడి ఉందని.. గత్యంతరం లేక ఆత్మహత్య యత్నం చేశానని విలపించాడు. స్పందించిన కలెక్టర్​ నారాయణ రెడ్డి.. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.

భూమి కబ్జా చేశారని కలెక్టరేట్​ ఎదుట ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి: కేబీఆర్​ పార్కులో యువకుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.