పంటపొలానికి నీరు పెట్టిందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తూ.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన భోగిని సారయ్య(50) అనే రైతు పొలానికి నీరు పెట్టేందుకు శనివారం ఉదయం బావి వద్దకు వెళ్లాడు. ఆ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సారయ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా ఆదివారం ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కాలువలో మంటలు.. తప్పిన ప్రమాదం