జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సూరవేన రాజయ్య(39) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్యకు నాలుగు ఎకరాల పొలం ఉంది. సాగుకు పెట్టుబడి, ఇంటి అవసరాల కోసం అప్పులు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఇబ్బందులు తట్టుకోలేక సాయంత్రం బావి వద్దనే పురుగుల మందు తాగాడు.
గమనించిన రైతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- ఇదీ చదవండి : సరుకు రవాణా రంగానికి లారీ డ్రైవర్ల కొరత