Family suicide attempt: "తమ భూవిు ఆక్రమణకు గురైందని.. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు కనీసం పట్టించుకోవడం లేదని" ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. సూర్యాపేట జిల్లా అయిలాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బుచ్చమ్మ కుటుంబం తమకు న్యాయం చేయమంటూ చివ్వెంల మండల ఎమ్మార్వో కార్యాలయం దగ్గరకు వచ్చారు.
అధికారులకు తమ భూమి కబ్జా చేశారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీనితో చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి బాధితులను సుర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి:
- కోర్టులో ఆ కేసు ఉండగానే.. మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త
- వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం... పోలీసు వర్గాల్లో దుమారం
- ఆలోచనలేని ఆవేశం.. నాలుగు ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?