ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటుచేసుకొంది. నడిగడ్డ సమీపంలోని మల్దార్‌పేటలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతోసహా దంపతులు.. శీతల పానీయంలో సైనైడ్ కలుపుకొని తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మృతులు చంద్రశేఖర్(35), కళావతి(30), అంజలి(16), అఖిల(14)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: పుట్టింటికి వచ్చి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన మహిళ