ETV Bharat / crime

Fake Gold Loan: నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్షల్లో రుణాలు.. ఘరానా ముఠాపై కేసు - ts news

Fake Gold Loan: బ్యాంకు అప్రైజర్.. బంగారం తనఖా పెట్టేటప్పుడు అది ఎంత బరువుంది..? అసలు బంగారమా..? నకిలీనా..? ఈ విషయాలను ధృవీకరించాల్సిన బాధ్యతను నిర్వహిస్తారు. దీనినే ఓ బ్యాంకుకు చెందిన అప్రైజర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి కుమ్మక్కయ్యాడు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా తనఖా పెట్టి బ్యాంకు నుంచి ఏకంగా రూ.16.22 లక్షలు స్వాహా చేశాడు. బ్యాంకును మోసగించిన ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదైంది.

Fake Gold Loan:  నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్షల్లో రుణాలు.. ఘరానా ముఠాపై కేసు

author img

By

Published : Jan 7, 2022, 5:03 PM IST

Fake Gold Loan: అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేశారు. నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి లక్షల్లో రుణం పొందారు. హైదరాబాద్​ బాలానగర్​లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారు ఆభరణాలతో ఓ ఘరానా ముఠా రుణం తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో జరిగిన ఈ తతంగంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పక్కా ప్లాన్​తో కొట్టేశారు..

చింతల్ ఎస్​బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ మార్టిన్, ఆయన భార్య పద్మావతి , అప్రైజర్​ బ్రహ్మచారి ముఠాగా ఏర్పడి బ్యాంకును మోసం చేశారు. నకిలీ బంగారు ఆభరణాలను అసలు బంగారు నగలుగా పేర్కొంటూ.. గత నెలలో బాలానగర్ ఎస్​బీఐ బ్యాంకులో రెండు విడతల్లో రూ.16.22 లక్షల నగదును ఈ ముఠా రుణంగా తీసుకుంది.

అనుమానం వచ్చి విచారిస్తే..

అనంతరం అప్రైజర్ బ్రహ్మచారిపై అనుమానం వచ్చి బ్యాంకు మేనేజర్ మరో ప్రైవేటు అప్రైజర్​తో నగలను తనిఖీ చేయించగా.. అవి నకిలీవని తేలింది. దానితో బాలానగర్ పీఎస్​లో బ్యాంకు మేనేజర్​ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఫ్రాన్సిస్ మార్టిన్.... చింతల్ ​లోని

ఎస్​బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.