రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేరిట సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్ నకిలీ ఖాతా తెరిచారు. ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి మంత్రి పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. డబ్బు అత్యవసరం ఉందని వెంటనే గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పంపాలని అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల్లో గమనించిన తెరాస నేతలు పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ ఖాతాపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!